Preloader
(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు):

ఆత్మకూరు మండలం లో సైబర్ నేరాలను నియంత్రించేందుకు ఆత్మకూరు పోలీసుల ఆధ్వర్యంలో హౌజ్ బుజుర్గు గ్రామం లో బుధవారం “ఫ్లాష్ వాక్” కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని హౌస్ బుజుర్గ్ గ్రామంలో సి ఐ బాబులాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆగండి ఆలోచించండి – అడుగు వేయండి”* అనే అంశం పై గ్రామ ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆత్మకూరు సి ఐ బాబులాల్ మాట్లాడుతూ.. తెలియని వ్యక్తులకు సెల్ ఫోన్ కు వచ్చినఓ టి పి వివరాలు వెల్లడించవద్దని, అపరిచిత లింకులను క్లిక్ చేయవద్దని, ఆన్‌లైన్ గేమ్స్‌కు దూరంగా  ఉండాలని సూచించారు. “డిజిటల్ అరెస్ట్” అనేది లేదని, ఎవరైనా డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరిస్తే మోసపోవద్దని కోరారు. సైబర్ మోసానికి గురైన వెంటనే *టోల్ ఫ్రీ నంబర్ 1930* కు కాల్ చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్ఐ తిరుపతి, గ్రామ సర్పంచ్ మౌలా, కానిస్టేబుల్ ప్రవీణ్ కుమార్, సుమారు 80 మంది గ్రామస్థులు పాల్గొన్నారు

Share this news as a Photo Card

01 October 2026

హౌజు బుజుర్గు గ్రామంలో సైబర్ నేరాలపై అవగాహన

www.jaibharatvoice.com