Preloader

కాకతీయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ఆచార్య ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రంపలువురు అధికారులను ఒక సంవత్సరం కాలానికి వివిధ బాధ్యతల్లో నియమిస్తూ నియామక పత్రాలను అందజేశారు.ఇంగ్లీష్ విభాగ సహా ఆచార్యురాలుడాక్టర్ బి. దీపాజ్యోతికి అదనపు పరీక్షల నియంత్రణ అధికారిగా, పీజీ కళాశాల ప్రిన్సిపాల్పి. నిర్మలకు మహిళా కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌గా నియామక పత్రాలు అందజేశారు.అకాడమిక్ ఆడిట్ డీన్‌గా ఉన్నఆచార్య జి. హనుమంత్ స్థానంలో న్యాయ కళాశాల ఆచార్యులుఆచార్య ఎం. శ్రీనివాస్ను, లీగల్ సెల్ డైరెక్టర్‌గా ఉన్న ఆచార్య ఎం. శ్రీనివాస్ స్థానంలో న్యాయ కళాశాల ఆచార్యులుడాక్టర్ ఎన్. సుదర్శన్ను, అడ్మిషన్స్ జాయింట్ డైరెక్టర్‌గాడాక్టర్ అకుతోట శ్రీనివాసులును నియమించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అధికారులను పలువురు బోధనా, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు అభినందించారు.

Share this news as a Photo Card

02 October 2026

నూతన అధికారులకు నియామక పత్రాల అందజేత

www.jaibharatvoice.com