( జై భారత్ వాయిస్ ఆత్మకూరు):
ఆత్మకూరు మండల కేంద్రంలోని పోచమ్మ సెంటరు, శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ సమీపంలో ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలకు ఆత్మకూరు సర్పంచ్ పర్వతగిరి మహేశ్వరి రాజు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు బతుకమ్మ సంబరాల్లో భాగంగా మహిళలు ఉదయం నుంచి బతుకమ్మలను వివిధ రకాల పూలతో పేర్చి గౌరమ్మను నిలిపి నివేదన నిర్వహించారు. అనంతరం వాడవాడల మహిళలు ,పిల్లలు బతుకమ్మలను చేతబూని శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయ సమీపంలోకి చేర్చి బతుకమ్మ పండుగ సంబరాలలో భాగంగా కోలాటాలు డ్యాన్సులను నిర్వహించారు. బతుకమ్మ పండుగ సంబరాలలో భాగంగా పోచమ్మ సెంటర్లో స్టేజి ఏర్పాటు చేసి వివిధ బతుకమ్మ పాటలను వేయగా మహిళలు వాటికి అనుగుణంగా ఆడి పాడారు దగ దగ మెరిసే లైట్లను ఏర్పాటు చేశారు. హన్మకొండ నుంచి వచ్చిన కళాకారులు డ్యాన్స్ లు చేసి మహిళను ఉత్సాహ పరిచారు. మహిళలకు తాగునీటి సౌకర్యం కల్పించారు. ఈ బతుకమ్మ వేడుకలకు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఇనగాల వెంకటరామిరెడ్డి లు వేరువేరుగా హాజరయ్యారు బతుకమ్మ సంబరాలలో పాల్గొన్న మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆత్మకూరు సర్పంచ్ పర్వతగిరి మహేశ్వరి రాజు , ఉప సర్పంచి పైడి, వార్డు సభ్యులు రవి, జైపాల్ రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవూరి జలంధర్ రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పరికరాల వాసు ఆత్మకూరు గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు తాళ్ల కిరణ్ కుమార్ మండల కాంగ్రెస్ నాయకులు ఎగితే లింగయ్య అల్వాల రవి, తనుగుల సందీప్ మన్తుర్తి రవి తదితరులు పాల్గొన్నారు
