Preloader
ఆడపడుచులకు బతుకమ్మ శుభాకాంక్షలు ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి

(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు):
బతుకమ్మ పండుగ ప్రారంభం సందర్భంగా పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మహిళ లకు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మకూరు మండల కేంద్రంలోని పోచమ్మ సెంటర్ లో శనివారం భారీ ఎత్తున ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాల లో పాల్గొని మాట్లాడారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు, ఆడపడుచులు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. పూలను పూజిస్తూ ప్రకృతిని ఆరాధించే ఈ పండుగ ప్రతి ఇంటా సంతోషాన్ని, సౌభాగ్యాన్ని నింపాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని వారు కోరుకున్నారు.
తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, ఐక్యతకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ ప్రజలందరి జీవితాల్లో ఆనందం నింపాలని ఆకాంక్షించారు.బతుకమ్మ సంబరాల లో ఆత్మకూరు గ్రామ సర్పంచ్ పర్వతగిరి మహేశ్వరి రాజు వార్డు సభ్యులు జైపాల్ రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవూరి జలంధర్ రెడ్డి ,మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పరికరాల వాసు, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాళ్ళ కిరణ్ కుమార్ పిఎసిఎస్ మాజీ చైర్మన్ ఏరుకొండ రవీందర్ గౌడ్ మండల నాయకులు, ఎగితే లింగయ్య,మంతుర్తి రవి , తనుగుల సందీప్, మార్తా రవి,తదితరులు పాల్గొన్నారు

Share this news as a Photo Card

10 October 2026

ఆడపడుచులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి

www.jaibharatvoice.com