హనుమకొండ జిల్లా ఉద్యమకారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఇర్సడ్ల సదానందం డిమాండ్ చేశారు ఆదివారం అక్కంపేట లో జరిగిన సమావేశంలో మాట్లాడారు మాజీ ఎంపీపీ గోపు మల్లికార్జున్ ఆధ్వర్యంలో కమిటీ వేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇర్సడ్ల సదానందం ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులకు అప్పటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఉద్యమకారులను అన్ని విధాల ఆదుకోవాలని కోరారు .కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకపోతే టిఆర్ఎస్ కు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు ఏ పిలుపు ఇచ్చిన ఉద్యమ కారులందరూ ఏకతాటిపై నిలబడాలని కోరారు. ఈ సందర్భంగా మండల కమిటీ అధ్యక్షుడు బాబుమియా, కార్యదర్శి రాజయ్య పాల్గొన్నారు.
గ్రామ కమిటీ అధ్యక్షులు గా రాయరాకుల సాయిలు, ఉపాధ్యక్షులుగా కూస పాపయ్య, గుండెబోయిన నరసింహస్వామిగౌడ్, సామల అశోక్ నాగన బోయిన మల్లయ్య ,ప్రధాన కార్యదర్శిగా ముద్దం లింగమూర్తి, కార్యదర్శులుగా ఎరుకల యాదగిరి ,గోపూ మల్లేష్, కడుదుల మల్లయ్య, గోపు చిన్నరాజు, ముసుకు మహేందర్ ,పోలేపాక సమ్మయ్య, బొడ్డు నరసయ్య ,మాదాసి సామెల్, ఏసోబు, రఫీ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు
