Reporter : K.Ashok
(జై భారత్ వాయిస్, న్యూస్ ,ఆత్మకూరు ) ఆత్మకూరు ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పొగాకు ఉత్పత్తుల దుష్ఫలితాలపై శుక్రవారం అవగాహన సదస్సు, ర్యాలీ నిర్వహించారు.హెడ్మాస్టర్ నిర్మల కుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ స్పందన హాజరయ్యారు.ఈ సందర్భంగా డాక్టర్ స్పందన మాట్లాడుతూ “సిగరెట్, బీడీ, గుట్కా మరియు ఇ-సిగరెట్ల వాడకం వల్ల నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల వ్యాధులు, గుండె జబ్బులు వస్తాయి. విద్యార్థులు చిన్న వయస్సు నుండే పొగాకు వ్యసనాలకు దూరంగా ఉండాలి” అని సూచించారు. అనంతరం విద్యార్థులు *”పొగాకు మానండి – ఆరోగ్యాన్ని కాపాడండి”* అనే నినాదాల ప్లకార్డులతో .ఆత్మకూరు వీధుల్లో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు
పాఠశాల పరిసరాల100 గజాల పరిధిలో పొగాకు అమ్మకాలు చట్టరీత్యా నేరమని, తమ బడిని పొగాకు రహిత విద్యాసంస్థ’ గా కొనసాగిస్తామని హెచ్.ఎం నిర్మల కుమారి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పొగాకు వాడబోమని ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు నిర్మల కుమారి, డాక్టర్ స్పందన, ఉపాధ్యాయులు రాజు, సిహెచ్ఓ ఖలీమ్ జునైద్, సూపర్ వైజర్ రమేష్, ఉపాధ్యాయ బృందం, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
–


