Preloader
Reporter : K.Ashok

(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు)

ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఓటు చోరీకి వ్యతిరేకంగా నిర్వహించిన నిరసన కార్యక్రమంలో రామకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, కాంగ్రెస్ నాయకులు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, కె.సి. వేణుగోపాల్‌లను కలిసి, తెలంగాణలో గవర్నర్ కోటాలో తనను ఎమ్మెల్సీగా ఎంపిక చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డిల దృష్టికి కూడా తన అభ్యర్థనను తీసుకెళ్లినట్లు తెలిపారు.ఈ సందర్భంగా శనివారం డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ మాట్లాడుతూ… ఇందిరా గాంధీ కాలం నుంచి తమ కుటుంబం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉందన్నారు. విద్యార్థి దశలో ఎన్ఎస్‌యూఐ (NSUI) నుంచి పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నానని స్మరించుకున్నారు. తనకు గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా పలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ సామాజిక వర్గాల సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలపడం పట్ల హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తనకు మద్దతుగా సిఫారసు లేఖలు అందించిన 30 మంది మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు .
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి తన సేవలను గుర్తించి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తారనే పూర్తి విశ్వాసం ఉందన్నారు. పార్టీ అగ్రనాయకత్వం, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్, ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ మరియు పార్టీ పెద్దలు అందిస్తున్న ప్రోత్సాహానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవకాశం లభిస్తే పేదలు, దళితులు, బహుజనులు, అణగారిన వర్గాలు, నిరుద్యోగ యువత సమస్యల పరిష్కారానికి, సామాజిక న్యాయం సాధనకు కాంగ్రెస్ పార్టీ ద్వారా మరింత అంకితభావంతో పనిచేస్తానని స్పష్టం చేశారు.

Share this news as a Photo Card

31 October 2026

గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలి: రాహుల్ గాంధీ, ఖర్గేలకు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ విజ్ఞప్తి

www.jaibharatvoice.com