Preloader
Reporter: Kakani Ashok.
(జై భారత్ వాయిస్, న్యూస్ ఆత్మకూరు)
ఆత్మకూరు పోలీస్ స్టేషన్ ను శనివారం పరకాల ఏసీపీ సతీష్ బాబు వార్షిక తనిఖీ నిర్వహించారు.
వార్షిక తనిఖీల్లో భాగంగా ఏసీపీ ఆత్మకూరు పోలీస్ స్టేషన్ ను సందర్శించి, స్టేషన్ రికార్డులు, పరిసరాలు, కేసుల వివరాలను పూర్తి స్థాయిలో పరిశీలించారు. అనంతరం పోలీసుల పరేడ్ ను పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా ఏసీపీ సతీష్ బాబు మాట్లాడుతూ పోలీసులు నిత్యం ఉన్నతాధికారుల సూచనలను పాటిస్తూ బాధ్యతతో విధులు నిర్వహించాలని సూచించారు. మండలంలోని గ్రామాల్లో శాంతి భద్రతల పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకొని ఉన్నతాధికారులకు నివేదించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఆత్మకూరు సీఐ బాబూలాల్, ఎస్ఐలు, కానిస్టేబుళ్లు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Share this news as a Photo Card

31 October 2026

ఆత్మకూరు పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీ - సిబ్బందికి సూచనలు

www.jaibharatvoice.com