జైభారత్ వాయిస్ న్యూస్ శ్రీసత్యసాయి
శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ మండలం గొల్లపల్లి రిజర్వాయర్ లో మునిగి 5గురు మహిళల విహారయాత్ర విషాదంగా మారడంపై మంత్రి సవిత ఆవేదన వ్యక్తం చేశారు. సంతోషంగా గడపాల్సిన సమయంలో విషాదం చోటుచేసుకోవడం బాధాకరంమని మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని తెలిపారు. విహారయాత్రలో సందర్శకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారుజ. సంతోషం ఎప్పుడూ విషాదం కాకూడదని పర్యాటక ప్రాంతాల చెరువులు, రిజర్వాయర్ల దగ్గర హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి అదేశించారు.
