జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షులు గాజే వేణుగోపాల్ రాష్ట్రవ్యాప్తంగా వైద్య ఆరోగ్యశాఖలో నేషనల్ హెల్త్ మిషన్ స్కీం లో వివిధ క్యాడర్లలో పనిచేస్తున్న సుమారు 17వేల మంది చేస్తున్న నిరవధిక సమ్మెకు సంఘీభావంగా.. టీఎన్జీఓస్ యూనియన్ వరంగల్ జిల్లా అధ్యక్షులు గాజే వేణుగోపాల్ ఆధ్వర్యంలో పోచమ్మ మైదాన్ కూడలిలో నిర్వహిస్తున్న నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల సమ్మె శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా టీఎన్జీఓస్ యూనియన్ అధ్యక్షులు గాజె వేణుగోపాల్ మాట్లాడుతూ దీర్ఘకాలికంగా అపరిస్కృతంగా ఉన్న నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, కొన్ని క్యాడర్లో తగ్గించిన జీతభత్యాలను వెంటనే సవరించాలని, ఔట్సోర్సింగ్ వ్యవస్థను రద్దుచేసి, స్టేట్ హెల్త్ సొసైటీ ద్వారా జీతభత్యాలు చెల్లించాలని ఈ దిశగా ప్రభుత్వం వెంటనే ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, ఇoదుకు గాను టీఎన్జీఓస్ యూనియన్ తమ సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. జిల్లా కార్యదర్శి పాలకుర్తి సదానందం మాట్లాడుతూ రెగ్యులర్ ఉద్యోగులకు అందించే అన్ని బెనిఫిట్స్ ని నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులకు కూడా వర్తింప చేయాలని పొరుగు సేవల ఒప్పంద కార్మికుల వ్యవస్థను రద్దుచేసి శాశ్వత ప్రాతిపదికన నియమించి,అర్హులైన మహిళా ఉద్యోగినులకు 180 రోజుల ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతి ఎన్ హెచ్ ఎం ఉద్యోగికి క్యాడర్ ఫిక్సేషన్ చేసి 100% గ్రాస్ సాలరీ చెల్లించాలని, ముఖ్యంగా కాంటిజెంట్ వర్కర్ నుండి డాక్టర్ల వరకు ఎలాంటి షరతులు లేకుండా క్రమబద్ధీకరించాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిటీ అధ్యక్షులు శంకేశి రాజేష్,నేషనల్ హెల్త్ మిషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ భరత్ కుమార్,నితిన్,అర్చన అనిల్,అనూష,సుజాత సునీత మరియు నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
