Preloader

జై భార‌త్ వాయిస్ న్యూస్ గీసుకొండ‌
గీసుగొండ మండల కేంద్రంలోని బసవేశ్వర శివాలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గురువారం నాటికి ఐద‌వ‌ రోజుకు చేరుకున్నాయి.ఈ సందర్భంగా అమ్మవారు శ్రీబాల త్రిపుర సుందరి దేవి శాకంబరీ అలంకరణలో కూరగాయలతో అలంకరించబడి భక్తులకు దర్శనమిచ్చారు. శాకంబరీ అవతారంలో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు పులకించిపోయారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు యాదగిరి లక్ష్మీనారాయణ, B. రమేష్, గుడిమెట్ల రాధాకృష్ణమూర్తి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం దేవీ నవరాత్రి ఉత్సవ నిర్వాహకులు యాదగిరి అశోక్, గీసుగొండ ఉపసర్పంచ్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి కోట ప్రమోద్, టిగిరికారి శ్రీకాంత్, మహమ్మద్ సోని, యాదగిరి కుమార్, కోలా వేణు, పుల్లూరి రవి, వటుకుల రవీందర్ రెడ్డి, కోట నాగేష్, వీరాటి రాజిరెడ్డి, కోలా ప్రవీణ్, పొగాకు రాజన్న, నరిశెట్టి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Share this news as a Photo Card

15 October 2026

బసవేశ్వర శివాలయంలో ఘనంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు -

www.jaibharatvoice.com