Preloader

వరంగల్ జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఘనంగా బతుకమ్మ సంబరాలు వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో టీఎన్జీవోస్, టీజీవో, ట్రెస్సా, క్లాస్ ఫోర్త్ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగిన బతుకమ్మ ఉత్సవాలలో వరంగల్ జిల్లా కలెక్టర్ శ్రీమతి సత్య శారదా దేవి ఐఏఎస్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని శాఖల నుండి మహిళ ఉద్యోగినులు తీరొక్క పూలతో పేర్చి బతుకమ్మలతో హాజరై ఉత్సాహంగా, లయబద్ధంగా, బతుకమ్మ పాటలు పాడుతూ, కోలాటాలతో నృత్యం చేస్తూ సందడి చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీమతి సత్య శారదా దేవి మాట్లాడుతూ.. భాద్రపద మాసం అమావాస్య నుండి తొమ్మిది రోజులపాటు గౌరమ్మతో బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో మహిళలు తమ కష్టసుఖాలు, ప్రేమ, స్నేహం,బంధుత్వం, ఆప్యాయతలను పంచుకుంటారని, ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ప్రకృతి పరంగా లభించే పూలనే దేవతగా కొలుస్తూ, బతుకమ్మ ఉత్సవాలను తెలంగాణ వ్యాప్తంగా జరుపుకోవడం సంతోషకరమని, అందులో భాగంగా ఈరోజు జిల్లాలోని అన్ని శాఖల మహిళా ఉద్యోగ మణులు తరలివచ్చి తమ నిత్య దైనందిన ఉద్యోగ జీవితంలో నుండి ఉపశమనం పొందే విధంగా పాల్గొన్నారు అని తెలిపారు. వరంగల్ జిల్లా టిజీఈజాక్ చైర్మన్, టీఎన్జీవోస్ యూనియన్ అధ్యక్షులు గాజే వేణుగోపాల్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో జరిగిన బతుకమ్మ ఉత్సవాలలో జిల్లాలోని అన్ని శాఖల నుండి పాల్గొన్న మహిళ ఉద్యోగమణులకు కృతజ్ఞతలు మరియు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియచేసారు. బతుకమ్మ పండుగ తెలంగాణలోని వివిధ వర్గాల ప్రజలకు బ్రతుకు దెరువు ఇస్తుందని అందుకే బతుకమ్మ పండుగను తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక మరియు అధికారిక పండుగగా జరుపుకుంటారని అన్నారు. టిజిఓ అధ్యక్షులు ఫణి కుమార్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకైనా బతుకమ్మ పండుగ తెలంగాణ అస్తిత్వంలోనే ఉందని మహిళలు తమ అస్తిత్వాన్ని చాటే విధంగా ఉత్సాహంగా పాల్గొని చివరి రోజు పెద్ద బతుకమ్మ పండుగను జరుపుకుంటారని ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులందరికి అందరికీ శుభం కలగాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు కిషోర్ కుమార్ ఐఏఎస్, గణేష్ ఐఏఎస్,జిల్లా రెవెన్యూ అధికారి విజయలక్ష్మి ఆర్డీవోలు సుమా ఉమారాణి జిల్లా అధికారులు డిఎంహెచ్వో డాక్టర్ రాజారెడ్డి జెడ్పీ సీఈవో వసంత డిపిఓ కల్పన పశుసంవర్ధక శాఖధికారి డాక్టర్ బాలాజీ టిఎన్జీవో జిల్లా కార్యదర్శి పాలకుర్తి సదానందం , గౌరవ అధ్యక్షులు గజ్జల రాంకిషన్ కోశాధికారి కిరణ్ కుమార్ ట్రెస్సా జిల్లా అధ్యక్షులు గని పాక రాజ్ కుమార్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు , రియాజుద్దీన్, సిటీ అధ్యక్షులు శెంకేషి రాజేష్,నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు సాంబయ్య, కార్యదర్శి భాను, టీఎన్జీవో జిల్లా ఉపాధ్యక్షులు గద్దల రాజు ఇంద్రసేనారెడ్డి వంశీధర్ బత్తిని రమ దేవి, సునీత నాయర్ రవికుమార్ జోసఫ్ అర్జున్ చిరంజీవి గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Share this news as a Photo Card

15 October 2026

వరంగల్ జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

www.jaibharatvoice.com