Preloader
వారాల కులాన్ని ఓబీసీ జాబితాలో చేర్చాలి

-వారాల కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పావు శెట్టి నరసింహ రాములు
(జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ)
అన్ని రంగాలలో వెనుకబడిన వారాల కులాన్ని ఓబీసీ జాబితాలో చేర్చాలని తెలంగాణ రాష్ట్ర వారాల కుల సంఘం ప్రధాన కార్యదర్శి పావుశెట్టి నరసింహ రాములు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అభ్యర్థించారు. మండల కేంద్రంలోని హసనపర్తి వారాల కుల సంఘం కమ్యూనిటీ భవనంలో ఆదివారం వారాల కుల సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి కందుకూరి సంజీవయ్య సమన్వయకర్త గా జిల్లా అధ్యక్షులు గుండమీది రవీందర్ అధ్యక్షతన నాలుగవ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పావుశెట్టి నరసింహా రాములు హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ఎంతోకాలంగా గుర్తింపు లేని వారాల కులాన్ని బీసీ జాబితాలో చేర్చిన రాష్ట్ర ప్రభుత్వంతో పాటు తెలంగాణ రాష్ట్ర వారాల కుల సంఘం కార్యవర్గానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వారాల కులానికి కేంద్రం జాబితాలో లేకపోవడం వల్ల అనేక మంది విద్యావంతులు, వివిధ రంగాలలో నిష్ణాతులైన నిపుణులు కేంద్ర ఉద్యోగాలకు అవకాశం దొరకక అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈశ్వరయ్య కమిషన్ కు కావాల్సిన సమాచారాన్ని తెలంగాణ వారాల కుల సంఘం ద్వారా వివరాలను అందజేయడం జరిగిందని తెలిపారు. తక్షణమే వివరాలను పరిశీలించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో సమగ్ర విచారణ జరిపి అన్ని రంగాలలో వెనుకబడిన వారాలకులాన్ని ఓబీసీ జాబితాలో చేర్చి ఆదుకోవాలని కోరారు. ముఖ్యంగా వారాల కుల సంఘం అభివృద్ధి జరగాలంటే రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు రాబోయే రోజుల్లో ఏ పార్టీలో ఉన్న వారైనా వారాల కుల సంఘం ప్రతినిధుల గెలుపు కోసం ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్తులో జరగబోయే క్యాలెండర్ ఆవిష్కరణ ప్రతిభా పురస్కారాల కోసం ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా వ్యవహరించి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వారాల కుల సంఘం రాష్ట్ర మహిళా కార్యదర్శి పావుశెట్టి కృష్ణవేణి, జిల్లా కోశాధికారి గంట నాగేశ్వర్, గ్రామ అధ్యక్షులు పావిశెట్టి రాజు, కార్యదర్శి గుండమీది కృష్ణమోహన్, జిల్లా ఉపాధ్యక్షులు ములుగురి రాజమౌళి, వివిధ గ్రామాల కార్యవర్గ సభ్యులు మలుగూరు బిక్షపతి, గంట సత్యనారాయణ, బొమ్మిశెట్టి యాదగిరి, శ్రీనివాస్, మహేష్ ప్రవీణ్ అభిలాష్, కోటిలింగం, కొండమీది శ్రీను, తదితరులు పాల్గొన్నారు. నృత్య ప్రదర్శన ఇచ్చిన పావుశెట్టి రస్నను సన్మానించారు.

Share this news as a Photo Card

12 October 2026

వారాల కులాన్ని ఓ బి సి జాబితాలో చేర్చాలి

www.jaibharatvoice.com