Preloader
(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు):
వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రతి పట్టభద్రుడు తప్పనిసరిగా ఓటు నమోదు చేసుకోవాలని గుడెప్పాడు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్
కాంతాల కేశవరెడ్డి పిలుపునిచ్చారు.మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆదేశాల మేరకు ఆత్మకూరు మండలం నీరుకుళ్ల గ్రామంలో గ్రాడ్యుయేట్ ఓటర్ నమోదుపై అవగాహన సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఆత్మకూరు మండల ఎమ్మెల్సీ కో-ఆర్డినేటర్ ఆర్షం మధుకర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కేశవ రెడ్డి మాట్లాడుతూ..పట్టభద్రులైన ప్రతి ఒక్కరూ ఓటును నమోదు చేసుకునేలా కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువత ఓటు నమోదు ప్రక్రియలో భాగస్వాములు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల యూత్ అధ్యక్ష, కార్యదర్శులు వంశీ, మధు, నీరుకుళ్ల పార్టీ అధ్యక్షుడు వంగేటి వేణు, మాజీ సర్పంచ్ ఆర్షం బలరాం, వార్డు సభ్యుడు ఆర్షం రామకృష్ణ, నాయకులు పోతరాజు ఈశ్వర్, సుధాకర్, సదయ్య, వెన్నపురెడ్డి రాజిరెడ్డి, వీరన్న, యూత్ నాయకులు అనిల్, మహమ్మద్, రాకేష్, బిక్షపతి, రాజు, తుప్పరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Share this news as a Photo Card

08 October 2026

గ్రాడ్యుయేట్ ఓటు హక్కును వినియోగించు కోవాలి

www.jaibharatvoice.com