ఆత్మకూరు మండలంలోని పెద్దాపూర్ హైస్కూల్ ఆవరణలో నిర్మించనున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రహరీ గోడ నిర్మాణ పనులకు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన విద్యను ఉచితంగా అందించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ వ్యవస్థను ప్రారంభించిందన్నారు. విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో విద్యారంగ అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ద్వారా పే ద విద్యార్థులకు కూడా కార్పొరేట్ పాఠశాలలకు దీటైన విద్యా అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కమలాపురం రమేష్ మాజీ జెడ్పిటిసి అంబటి రాజా స్వామి ఆత్మకూరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రేవూరి జలంధర్ రెడ్డి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పరికిరాల వాసు జిల్లా నాయకులు మాజీ సొసైటీ చైర్మన్ ఏరుకొండ రవీందర్ పరకాల నియోజకవర్గ యూత్ కార్యదర్శి మాదాసి శ్రీధర్ రాజు పెద్దాపూర్ సర్పంచ్ రవి జిల్లా నాయకులు ఏగితే లింగయ్య కంచ రవి తదితరులు పాల్గొన్నారు
మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి
ఆత్మకూరు మండలంలోని పెద్దాపూర్, ఆత్మకూరు గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన పలువురి కుటుంబాలను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి బుధవారం పరామర్శించారు.
పెద్దాపూర్ గ్రామానికి చెందిన ఎలుకటి నరసయ్య, బైరి మల్లమ్మ, గోనె కుమారస్వామి, పొదిల సమ్మక్క, ఆత్మకూరు గ్రామానికి చెందిన తనుగుల సాంబయ్య ఇటీవల మృతి చెందారన్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే, వారి నివాసాలకు వెళ్లి మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్త కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటానని, అన్ని వేళలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కమలాపురం రమేష్, ఆత్మకూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవూరి జలంధర్ రెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పరికిరాల వాసు, మాజీ జెడ్పీ టి సి అంబటి రాజస్వామి, పరకాల నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు మాదాసి శ్రీధర్, సర్పంచులు పర్వతగిరి మహేశ్వరీ రాజు, ఎలుకటి రవి, మాజీ సొసైటీ చైర్మన్ ఏరుకొండ రవీందర్, మండల కార్యదర్శి ఎగితే లింగయ్య,మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
