(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు) గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. బుధవారం పరకాల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం జరిగిన కార్యక్రమం లో ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్నా మని చెప్పారు.
అర్హులైన పేదలందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇల్లు అందిస్తా మని అన్నారు. గుడిసెలలో నివాసముంటున్న 168 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రోసిడింగ్ కాపీలను పరకాల శాసనసభ్యులు అందజేశారు. పరకాల టౌన్ మరియు పరకాల, నడి కూడా, దామెర, ఆత్మకూరు మండలాలకు చెందిన గుడిసెలలో నివాసముంటున్న 168 మంది నిరుపేద లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరీ పత్రాలను పంపిణీ చేశారు. ఆత్మకూరు మండలానికి 81, దామెర 17, నడికూడ 18, పరకాల మండలం 38, పరకాల టౌన్ 14 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… పేద ప్రజల సొంతింటి కల కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో నెరవేరుతుందని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత క్రమంలో దశలవారీగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని అన్నారు. గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చేదిద్దాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన లక్ష్యమన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పార్టీలకు అతీతంగ ఇండ్లను ఇస్తున్నామని అన్నారు.పారదర్శకంగా ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక జరిగిందని ప్రలోభాలకు, పైరవీలకి తావు ఉండదు అని అన్నారు. ప్రభుత్వం సూచించిన నిబంధన మేరకు ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకోవాలని,ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు మహిళా సంఘాల ద్వారా రుణాలు తీసుకోవచ్చని అన్నారు.. ప్రతి కుటుంబం ఆర్థికంగా బలపడాలని ఉద్దేశంతో ఏజెన్సీల ద్వారా పేద ప్రజలకు ఇండ్లను కట్టిస్తున్నామని అన్నారు.ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ కాపీలను అందుకున్న లబ్ధిదారులు త్వరితగతిన ఇంటి నిర్మాణ పనులు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ సిద్ధార్థ నాయక్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి, ఆత్మకూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవూరి జలంధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.