Preloader
(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు):
ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో బిఎల్వోలు సూపర్వైజర్లు ఇతర ఎన్నికల సిబ్బంది సమన్వయం తో పని చేయడంతోనే పరకాల నియోజకవర్గం తెలంగాణ రాష్ట్ర స్థాయిలో ముందంజలో ఉన్నదని పరకాల ఆర్డిఓ వెంకన్న అన్నారు .ఆత్మకూరు మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయం లో మంగళవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో మండల స్థాయి అధికారులతో పాటు సిబ్బంది ఓటర్ల వివరాల సేకరణ ధ్రువీకరణ డిజిటలైజేషన్ తదితర ప్రక్రియలను సమర్థవంతంగా నిర్వహించారని ఆయన బూతు లెవెల్ అధికారుల సేవలను అభినందించారు. ఎమ్మెల్సీ ఓట్ల నమోదు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసి పరకాల నియోజకవర్గంలో రాష్ట్రస్థాయి గుర్తింపు తీసుకురావాలని ఆర్డీవో కోరారు ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో సమర్థవంతంగా పనిచేసిన బూత్ లెవెల్ అధికారులు, బి ఎల్ ఓ లు ఇతర అధికారులను ఆర్డిఓ అభినందించి  సన్మానించారు. ఈ సందర్భంగా మండల స్థాయి అధికారులు రెవెన్యూ అధికారి జగన్మోహన్ రెడ్డి, మండల అభివృద్ధి అధికారీ శ్రీనివాస్ రెడ్డి లను ఆర్డిఓ సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల తహశీల్దార్ జగన్మోహన్ రెడ్డి,ఎండిఓ శ్రీనివాస్ రెడ్డి ,డిప్యూటీ తహసిల్దార్ మంజుల సూపర్వైజర్లు ఆర్ ఐ ఫరూకు, ఆర్ఐ హారికా, కిరణ్, కంప్యూటర్ ఆపరేటర్లు బిఎల్వోలు పాల్గొన్నారు

Share this news as a Photo Card

07 October 2026

ఎస్ ఐ ఆర్ ప్రక్రియ లో పరకాల నియోజక వర్గం ముందంజ

www.jaibharatvoice.com