-కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు రేవూరి జలంధర్ రెడ్డి
(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు)
మహాత్మా గాంధీ ఆశయాలను ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కొనసాగించాలని ఆత్మకూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవూరి జలంధర్ రెడ్డి అన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని కాంగ్రెస్ మండల పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వృద్ధులకు పిల్లలకు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జలేందర్ రెడ్డి మాట్లాడుతూ సత్యం, ధర్మం, అహింస,సేవ మార్గాలే మానవాళికి అవసరమని బోధించిన మహా వ్యక్తి గాంధీజీ అని కొనియాడారు. ఆయన చూపిన మార్గాన్ని అనుసరించినప్పుడే ఆయనకు మనం ఇచ్చిన ఘనమైన నివాళి అని జలంధర్ రెడ్డి అన్నారు. స్వాతంత్ర కోసం బ్రిటిష్ వారి పైన అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు మహాత్మా గాంధీ అని అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కమలాపురం రమేష్, జిల్లా కార్యదర్శి చిదిరాల శ్రీనివాస్ రెడ్డి, ఆత్మకూరు కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు తాళ్ళ కిరణ్ ,మాజీ జెడ్పిటిసి కక్కర్ల రాధిక రాజు, మాజీ ఎంపీపీ మార్క సుమలత రజనీకాంత్ గౌడ్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పరికీరాల వాసు ,బీసీ సెల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ చిమ్మని దేవరాజ్ ,మాజీ పిఎసిఎస్ డైరెక్టరలు రేవూరి జయపాల్ రెడ్డి, కాడబోయిన రమేష్, గ్రామ ఉపాధ్యక్షుడు గంగి నేని సతీష్, నాయకులు వడ్డేపల్లి ప్రసాద్, అల్వాల రవీందర్ మంతు ర్తి రవి, ఎగితే లింగయ్య, పొనుగోటి సత్యనారాయణ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
