Preloader

ప్రపంచం గర్వించదగ్గ మహోన్నత నేత మహాత్మా మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ అని కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య వి. రామచంద్రం అన్నారు.  మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా కాకతీయ యూనివర్సిటీ పరిపాలన భవన ప్రాంగణంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని, ఇరువురి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బోధనా, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.  గాంధీజీ, లాల్‌బహదూర్ శాస్త్రి ఆదర్శాలను నేటి తరం కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు. అహింస బలహీనతకు సంకేతం కాదని, అది ఒక శక్తివంతమైన ఆయుధమని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ, లాల్‌బహదూర్ శాస్త్రి వంటి మహనీయులను స్మరించుకునే ఈ రోజు ప్రతి భారతీయుడు గర్వించదగ్గ రోజని అన్నారు.  ఈ కార్యక్రమంలో ఓఎస్డీ ఆచార్య బి. వెంకట్రామరెడ్డి, ఆచార్య పి. మల్లారెడ్డి, పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య రాజేందర్ కట్ల, ఆచార్య నరసింహాచారి, ఆచార్య గాదె సమ్మయ్య, డాక్టర్ ఎస్. మల్లేశ్వర్, డాక్టర్ టి. శాస్త్రి, డాక్టర్ పి. శ్రీనివాస్, పి.రవి,  తదితరులు పాల్గొన్నారు. ప్రజా సంబంధాల అధికారి డాక్టర్ పృథ్వీరాజ్ వల్లాల కార్యక్రమ సమన్వయకర్తగా వ్యవహరించారు.

Share this news as a Photo Card

02 October 2026

ప్రపంచం గర్వించదగ్గ నేత మహాత్మా గాంధీ

www.jaibharatvoice.com