జర్నలిస్టుల హక్కులు,సంక్షేమం కోసం టీయూడబ్ల్యూజె (ఐజెయు) జాతీయ కమిటీ ఆదేశానుసారం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నేడు అక్టోబర్ 2, 2026 జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని గ్రేటర్ వరంగల్ కార్యాలయం ఎదుట ఉన్న విగ్రహనికి పూలమాల వేసిజర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జాతీయ కమిటీ తీర్మానం మేరకు నేడు “పనిచేస్తున్న పాత్రికేయుల డిమాండ్” దినంగా పాటించాలన్న పిలువు లో భాగంగా ఈరోజు జిల్లా కమిటీ విజవంతంగా నిర్వహించింది.జరిగిన కార్యక్రమాన్ని వివరిస్తూ జాతీయ కౌన్సిల్ మెంబర్ సంగోజు రవి మాట్లాడుతూ జర్నలిస్ట్ లకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా సదుపాయం, ఉచిత వైద్య సదుపాయం కల్పించాలని కోరారు. ప్రభుత్వ ప్రైవేటు కార్పొరేట్ స్థాయి వైద్యశాలలో ఉచిత వైద్యాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దీర్ఘకాలికంగా పెండింగులో ఉన్న ఇండ్లు ఇండ్ల స్థలాల సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు. ముఖ్యంగా వరంగల్ తూర్పులో నిర్మాణం పూర్తయినప్పటికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేయడంలో ప్రజాప్రతినిధులు అధికారులు వహిస్తున్న నిర్లక్ష్య ధోరణిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం వరంగల్ జిల్లా యూనియన్ అధ్యక్షులు శ్రీరామ్ రాంచందర్ గారు మాట్లాడుతూ రాష్ట్రం లో ఉన్న జర్నలిస్ట్ సమస్యలను తొలిగించే విదంగా జాతీయ, రాష్ట్ర నాయకుల అడుగులో అడుగు వేస్తూ జిల్లా కమిటీలు ముందుకు సాగుతున్నాయి అన్నారు. వరంగల్ జిల్లాలో అనేక సమస్యలతో సతమతమవుతున్న జర్నలిస్టుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించామని అందులో భాగంగానే ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీకీ జర్నలిస్టుల సమస్యలపై లిఖితపూర్వకంగా రాసి వినతి పత్రం సమర్పించామన్నారు. సత్వరమే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్ట్ ల సమస్యలను పరిష్కరించి అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యుజె ( ఐజేయు) జిల్లా అధ్యక్షులు శ్రీరాం రామచందర్, ప్రధాన కార్యదర్శి మట్టా దుర్గాప్రసాద్, కోశాధికారి కొదాటి గోపాల కృష్ణ,ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు కందుల శ్రీధర్, ఉపాధ్యక్షులు జన్ను స్వామి, కూర్ణ వెంకటేశ్వర్లు, మహాదేవుని జగదీష్, సహాయ కార్యదర్శులు బొమ్మగాని సతీష్,చింతనూరి రాజు,బాధవత్ బాలాజీ, కార్యవర్గ సభ్యులు హుస్సేన్ పాషా,అక్రమ్,బాబర్, దేసు లక్ష్మణ్, కందుల శ్రీనివాస్,గాదె రవి,శీలం రమేష్, సీనియర్ జర్నలిస్ట్ పెరుమాండ్ల మధు, ఎండి సయీద్,సామల సూర్య ప్రకాష్, వలిషెట్టి సుధాకర్,ఎలుగందుల అజయ్ చిన్నబాబు, చైతన్య సాజిద్ పాషా, నితీష్,అమీర్,చిట్టి బాబు,మురళి, రాజేందర్ తదితర జర్నలిస్ట్ లు పాల్గొన్నారు.