Preloader
కాకతీయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్‌లోని ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ (EEE) విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులకుసౌర విద్యుత్ సాంకేతికత, తాజా ఆవిష్కరణలు, ఉద్యోగ అవకాశాలు, కెరీర్ మార్గదర్శకత్వంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా సౌర విద్యుత్ సాంకేతిక నిపుణులుడా. బి. శివ కుమార్ప్రత్యేక ఉపన్యాసం అందించారు. సౌర విద్యుత్ రంగంలోని తాజా సాంకేతిక పరిణామాలు, ఆధునిక సోలార్ పవర్ టెక్నాలజీలు, పునరుత్పాదక ఇంధన రంగంలో భవిష్యత్ అవకాశాలు, ఇంజినీరింగ్ విద్యార్థులకు అందుబాటులో ఉన్న కెరీర్ అవకాశాలను వివరించారు.పరిశ్రమ అవసరాలకు అనుగుణంగాసాంకేతిక నైపుణ్యాలు, ప్రాక్టికల్ నాలెడ్జ్, నిరంతర అభ్యాసంను పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ప్రొఫెసర్ కె. బిక్షాలు, EEE విభాగం ఇన్‌చార్జితూర్పాటి వెంకటేష్, అధ్యాపకులుఎస్. సాహితి, యశస్వినితదితరులు పాల్గొన్నారు. EEE విభాగ విద్యార్థులు హాజరయ్యారు.విద్యార్థులకు పరిశ్రమ నిపుణుల ద్వారా సాంకేతిక పరిజ్ఞానం, ఉద్యోగ అవకాశాలు, కెరీర్ మార్గదర్శకత్వం అందించే ఇటువంటి కార్యక్రమాలు వారి భవిష్యత్ కెరీర్‌కు ఎంతో దోహదపడతాయని తెలిపారు

Share this news as a Photo Card

02 October 2026

మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో సౌర విద్యుత్ సాంకేతికతపై అవగాహన కార్యక్రమం

www.jaibharatvoice.com