కాకతీయ విశ్వవిద్యాలయం ఇంగ్లీష్ విభాగ పరిశోధక విద్యార్థినిశ్రీ లక్ష్మి జాలకు డాక్టరేట్ లభించినట్లు విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారిఆచార్య రాజేందర్ కట్లతెలిపారు.శ్రీ లక్ష్మి జాల “Cultural Displacements and Hybridism in Writings of Chetan Bhagat”అనే అంశంపై ఇంగ్లీష్ విభాగ సహాయ ఆచార్యురాలుడాక్టర్ ఆర్. మేఘనా రావు పర్యవేక్షణలో పరిశోధన పూర్తి చేశారు.ప్రస్తుతం ఆమె భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోనితెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్‌లో లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. డాక్టరేట్ సాధించిన శ్రీ లక్ష్మి జాలను పలువురు బోధనా, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు అభినందించారు