Preloader

జై భారత్ వాయిస్ న్యూస్ జగిత్యాల:జగిత్యాల పట్టణంలోని 24వ వార్డు మార్కండేయ నగర్‌లో శివ హిందూ యూత్ ఆధ్వర్యంలో గోరింటాకు కార్యక్రమాన్ని ఘనంగానిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ హాజరై మహిళలతో కలిసి గోరింటాకు కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మహిళలతో ఆత్మీయంగా ముచ్చటిస్తూ కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. సంప్రదాయాలను, మహిళల ఐక్యతను ప్రతిబింబించేలా ఈ కార్యక్రమం కొనసాగింది.
కార్యక్రమంలో కౌన్సిలర్ మానపురి పవిత్ర మహేష్ పాటు పలువురు మహిళలు, శివ హిందూ యూత్ సభ్యులు పాల్గొన్నారు.

Share this news as a Photo Card

25 September 2026

Gorantakuమార్కండేయ నగర్‌లో ఘనంగా గోరింటాకు కార్యక్రమం

www.jaibharatvoice.com