Preloader
కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు శ్రేణులు ఐక్యంగా పనిచేయాలి : -పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి

(జై భారత్ వాయిస్ న్యూస్ -ఆత్మకూరు )

వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గెలుపునకు పార్టీ శ్రేణులంతా ఐక్యంగా పనిచేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పిలుపునిచ్చారు.
ఆదివారం అగ్రంపహాడ్ లోని జీఆర్ఎస్ కన్వెన్షన్ హాల్ లో పరకాల నియోజకవర్గ స్థాయి విస్తృత సన్నాహక సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అధ్యక్షత వహించిన ఈ సమావేశానికి వరంగల్ పార్లమెంట్ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్సీ శంకర్ నాయక్, హనుమకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, వరంగల్ డీసీసీ అధ్యక్షులు ఎండి అయూబ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్ కు తిరుగులేని బలం ఉందని, ఇక్కడి నుండే అభ్యర్థికి అత్యధిక మెజారిటీ అందించి అధిష్టానానికి బహుమతిగా ఇస్తామని స్పష్టం చేశారు.ఇనగాల వెంకట్రామ్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. శంకర్ నాయక్ మాట్లాడుతూ విద్యావంతులు, ఉద్యోగులు, నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని, ప్రతి పట్టభద్రుడు కాంగ్రెస్ వైపే నిలిచేలా కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పనిచేయాలని, అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేయించాలని పిలుపునిచ్చారు. విభేదాలు పక్కనపెట్టి సైనికుల్లా పనిచేయాలని కోరారు

.
ఈ సమావేశంలో జిల్లా కమిటీ ఉపాధ్యక్షుడు బోరిగం స్వామి, ఆత్మకూరు మండల అధ్యక్షుడు రేవూరి జలంధర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శులు రేవూరి రణధీర్ రెడ్డి, కమలాపురం రమేష్, యూత్ అధ్యక్షుడు మాదాసి శ్రీధర్, కార్యదర్శులు కక్కర్ల రాజు, కంచ రవి, పెంచికలపేట సింగిల్ విండో చైర్మన్ ఎగితే లింగయ్య, అక్కంపేట సర్పంచ్ ముద్దం సాంబయ్య, అగ్రంపహాడ్ సర్పంచ్ గంగుల మహేందర్, మాజీ జెడ్పీటీసీ అంబటి రాజస్వామి, మాజీ అధ్యక్షుడు వెనకటాల రవీందర్, పరకాల మార్కెట్ కమిటీ చైర్మన్, వివిధ మండలాల అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, అనుబంధ సంఘాల నాయకులు, మహిళా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Share this news as a Photo Card

25 October 2026

కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు శ్రేణులు ఐక్యంగా పనిచేయాలి :

www.jaibharatvoice.com