మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన స్నేహితులు
(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు)
ఆత్మకూరు మండల కేంద్రంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన ఉప్పుల లింగమూర్తి కుటుంబానికి స్నేహితులు అండగా నిలిచారు.
1989 – 90 బ్యాచ్ పూర్వ విద్యార్థులు లింగమూర్తి కుటుంబాన్ని ఆదివారం పరామర్శించి రూ.50 వేల ఆర్థిక సాయం అందించారు. భవిష్యత్తులో కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు కు చెందిన పూజారి రాము, పోలు రాజేష్ భయ్యా పైడి, కోడూరి రవి, సిరిపురం తిరుపతి పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
