(జై భారత్ వాయిస్ న్యూస్- ఆత్మకూరు ):
ఆత్మకూరు మండలంలో ఇటీవల మృతి చెందిన ఉప్పుల లింగమూర్తి , గంటా ప్రమీల, పెంచికలపేట గ్రామానికి చెందిన పసుల లక్ష్మీనర్సు కుటుంబాలను పరకాల బి జె పి ఇంచార్జీ పగడాల కాళీ ప్రసాదరావు పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులను కలిసి మృతికి గల కారణాలను అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఆప్తులను కోల్పోయి దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి మనోధైర్యం కల్పించారు.ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందచేశారు.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ టీంగిలికారి సత్యనారాయణ, మండల శాఖ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, దామెర అధ్యక్షుడు రాజ్ కుమార్, ప్రధాన కార్యదర్శి రవ్వ శివప్రసాద్ జిల్లా నాయకులు వంగాల బుచ్చిరెడ్డి, బూర దశరథం ,సముద్రాల రవి, మామూనూరి శ్రీనివాస్, పీసాల సాంబయ్య, జక్కుల మహేందర్, జిట్టె మధు , బలభద్ర కైలాసపతి, పాయిరాల రాజేందర్, వేల్పుగొండ రవి, ఉప్పుల కుమార్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు
