జై భారత్ వాయిస్ న్యూస్ పెనుకొండ: కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖల మంత్రి సవిత సూచించారు. ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు పెనుకొండ మున్సిపాలిటీ పరిధిలోని బూత్ ఇన్చార్జ్లతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు.పార్టీ నాయకులతో కలిసి ‘చెప్పాం.. చేస్తున్నాం’ పోస్టర్ను ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తోంది. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకు సాగుతున్నాం. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే మా ప్రభుత్వ లక్ష్యంమని తెలిపారు..ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే చెప్పాం.. చేస్తున్నాం ఇచ్చిన హామీల అమలే మా లక్ష్యం అనే నినాదంతో పార్టీ నాయకులతో కలిసి పోస్టర్ను ఆవిష్కరించారు.గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్నామని, గత రెండున్నరేళ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. వైఎస్సార్సీపీ చేస్తున్న ఆరోపణలకు వాస్తవాల ఆధారంగా సమాధానం చెప్పాలని, ప్రభుత్వ అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని అన్నారు. ప్రతి బూత్ పరిధిలో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. గెలుపే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేసి, ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని మంత్రి సవిత పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో , కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
