Preloader
*ఆత్మకూరు మండల కేంద్రంలో వాడవాడలా దుర్గామాత ర్యాలీ – భక్తి శ్రద్ధలతో నిమజ్జనం*

*(జై భారత్ వాయిస్ న్యూస్ – ఆత్మకూరు):*

హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో దుర్గామాత నిమజ్జన ర్యాలీ కన్నుల పండువగా, భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగింది. వాడవాడలా అమ్మవారి ఊరేగింపు సాగింది.నవరాత్రి ఉత్సవాలలో భాగంగా తొమ్మిది రోజుల పాటు ఆత్మకూరులోని దుర్గామాత ఆలయంలో పురోహితులు ఆరుట్ల మాధవ మూర్తి. ప్రత్యేక పూజలు, అభిషేకాలు, కుంకుమార్చనలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రతి రోజూ మహిళలు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.చివరి రోజు అమ్మవారికి మహా హారతి, పూర్ణాహుతి నిర్వహించిన అనంతరం నిమజ్జనానికి బయలుదేరారు. డప్పు చప్పుళ్లు, మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాహలం, జై దుర్గా మాతా నినాదాల నడుమ అమ్మవారి ఊరేగింపు పట్టణ పురవీధుల గుండా సాగింది. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారికి పూలు, కొబ్బరికాయలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ  కమిటీ ఆధ్వర్యంలో నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా పరికరాల వాసు, తనుగుల సందీప్, టిం గిలి కారి సత్యనారాయణ, జైపాల్ రెడ్డి, మహిళలు కలసి మాతా ర్యాలీ నిర్వహించారు.ఈ  కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు.

Share this news as a Photo Card

21 October 2026

ఆత్మకూరు మండల కేంద్రంలో వాడవాడలా దుర్గామాత ర్యాలీ - భక్తి శ్రద్ధలతో నిమజ్జనం*

www.jaibharatvoice.com