Preloader
*ఆత్మకూరులో కన్నుల పండువగా రావణ వధ కార్యక్రమం*

*(జై భారత్ వాయిస్ న్యూస్ – ఆత్మకూరు:)*

హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో మంగళవారం రాత్రి నిర్వహించిన రావణ వధ కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది.
ఆత్మకూరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పర్వతగిరి మహేశ్వరి-రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ రావణాసుర వధ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రాంరెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఇనుగాల వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ… ఆత్మకూరు మేజర్ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. దసరా పండుగ సందర్భంగా గ్రామస్తుల ఆనందం కోసం పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి సూచనగా ఈ రావణాసుర వధ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు.గత రెండు రోజులుగా దాదాపు 10 ఎకరాల స్థలంలో ఈ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేశారు. దసరా సందర్భంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏర్పాట్లు పూర్తి చేసి రాత్రి కార్యక్రమాన్ని నిర్వహించారు.జిల్లా అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రాంరెడ్డి రావణాసుర వధ కార్యక్రమాన్ని ప్రారంభించగానే టపాకాయలు పేల్చారు. కనులు మిరుమిట్లు గొలిపే కాంతులతో ఆట స్థలమంతా కాంతివంతమై శోభాయమానంగా మారింది. రావణాసుర దహనాన్ని చూసి హాజరైన ప్రజలు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు ఆత్మకూరుతో పాటు తిరుమలగిరి, కామారం, చౌళ్లపల్లి తదితర గ్రామాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మహిళలు, పిల్లలు, వృద్ధులు అత్యంత ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని తిలకించారు.గ్రామస్తులను ఉత్సాహపరిచేందుకు కళాబృందం చేత వివిధ జానపద గీతాలను పాడించి, నృత్యాలు వేయించారు. జానపద గీతాలు, నృత్యాలు గ్రామస్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవూరి జలంధర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రేవూరి రణధీర్ రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు తాళ్ల కిరణ్ కుమార్, మండల ఉపాధ్యక్షుడు గంగినేని సతీష్, యూత్ కాంగ్రెస్ నాయకుడు తనుగుల సందీప్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంజీవరెడ్డి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కందుకూరి నరేష్, వివిధ రాజకీయ పార్టీల కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

రావణాసుర వధ కార్యక్రమానికి పటిష్ట పోలీసు బందోబస్తు*

ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన రావణాసుర వధ కార్యక్రమానికి ఆత్మకూరు సీఐ బాబులాల్ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు నిర్వహించారు. నాలుగు గ్రామాల నుంచి ప్రజలు తండోపతండాలుగా తరలిరావడంతో ఇతర వాహనాలు, ద్విచక్ర వాహనాలు, కార్లను పోలీసులు క్రమబద్ధీకరించారు. ఆత్మకూరు ఎస్ఐ, పోలీసు సిబ్బంది, మహిళా పోలీసులు రావణాసుర దహన కార్యక్రమంలో పటిష్ట బందోబస్తు నిర్వహించారు.
ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు తీసుకోవడంతో పాటు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. దసరా పండుగ సందర్భంగా ఆత్మకూరు మండలంలోని పలు గ్రామాలలో జరిగిన ఉత్సవాలలో కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తూ పెట్రోలింగ్ నిర్వహించారు

Share this news as a Photo Card

21 October 2026

ఆత్మకూరులో కన్నుల పండువగా రావణ వధ కార్యక్రమం

www.jaibharatvoice.com