కాకతీయ విశ్వవిద్యాలయం మహిళా ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన 34 మంది ఎన్సీసీ కేడెట్లు సెప్టెంబర్ 20 నుంచి 29 వరకు మామునూరులోని 8 (గర్ల్స్) బెటాలియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కంబైన్డ్ యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్ (CATC) లో వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచారు. వాలీబాల్, టగ్ ఆఫ్ వార్, రిలే పరుగు తదితర పోటీల్లో ప్రతిభ చూపడంతో పాటు ఓవరాల్ ట్రోఫీని కూడా కైవసం చేసుకున్నారని కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య కే. భిక్షాలు తెలిపారు. అలాగే, 15 మంది కేడెట్లు ‘యువ ఆపద మిత్ర’ శిక్షణను విజయవంతంగా పూర్తి చేశారు. ఇంటర్ గ్రూప్ కాంపిటీషన్లోనూ కేడెట్లు ప్రతిభ ప్రదర్శించారని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా క్యాంప్ సీనియర్ అండర్ ఆఫీసర్ ఫై. సాయి తేజ, క్యాంప్ అద్జుటేంట్ పి. రిద్ధి, సార్జెంట్ ఎస్. స్వాతితో పాటు పాల్గొన్న కేడెట్లను కాకతీయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఆచార్య కే. ప్రతాప్ రెడ్డి, రిజిస్ట్రార్ ఆచార్య వి. రామచంద్రం, కేర్ టేకర్ యశస్విని, వీరయ్య నాయక్ లు అభినందించారు