Preloader
జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ
హనుమకొండలో కాకతీయ ప్రభుత్వ కళాశాల  ఈరోజు జాతీయ సేవా పథకం, ఎన్ సి సి ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ ప్రొఫెసర్  శ్రీనివాస్ నేతృత్వంలో వనమహోత్సవ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రిన్సిపాల్ మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యాన్ని కాపాడాలంటే మొక్కలు పెంచడం ఒక్కటే మార్గం అన్నారు. అడవులు తగ్గిపోవడం వల్ల అనేక ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయని పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. వృక్షో రక్షతి రక్షతః అనే నినాదంతో కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో  ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు,ఎన్సిసి క్యాడేట్ల సహాయంతో 60 మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కళాశాల హరితహారం కమిటీ, ఎకో క్లబ్ కమిటీ సభ్యులు వైస్ ప్రిన్సిపల్ రజినిలత, రాజశేఖర్, హరితహారం కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ కోమల, ఎకో క్లబ్ కన్వీనర్ ఎన్ ఎస్ ఎస్ పి. ఓ ఘన్ సింగ్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు సీతారాములు,గంగిశెట్టి శ్రీనివాస్, మాలతి లత,ఎన్సిసి ఇన్చార్జి రాజయ్య, స్టాఫ్ క్లబ్ సెక్రటరీ రవికుమార్, జాయింట్ సెక్రెటరీ కిషోర్ కుమార్, ఐ క్యూ ఏసీ కోఆర్డినేటర్  శ్రీనాథ్, సీనియర్ అధ్యాపకులు  చిన్న, సమ్మయ్య, వెంకన్న, ప్రొఫెసర్ సమత, పరీక్షల నియంత్రణ అధికారి శివ నాగ శ్రీను, ప్లేస్మెంట్ ఆఫీసర్ అనిల్ కుమార్, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, ఎన్సిసి క్యాడేట్లు, అధ్యాపకులు, విద్యార్థులు,  మెగా వనమోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Share this news as a Photo Card

29 September 2026

కాకతీయ ప్రభుత్వ కళాశాలలో వనమహోత్సవం

www.jaibharatvoice.com