* మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మా రెడ్డి
* (జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు)
ఆధ్యాత్మికతతో పాటు గ్రామీణ ఐక్యతను చాటిచెప్పే పండుగలు మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు అన్నారు.
ఆత్మకూరు మండలం పెద్దాపూర్ గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న దుర్గామాత నవరాత్రోత్సవాల్లో సోమవారం ఉదయం పాల్గొన్నారు. ఈ సందర్భంగా దుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు.
అనంతరం చల్లా ధర్మారెడ్డి గారు మాట్లాడుతూ.. దైవభక్తితో నిర్వహించే ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తిభావాన్ని పెంపొందించడంతో పాటు గ్రామస్తుల మధ్య ఐక్యత, సోదరభావాన్ని బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. పండుగలు మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించే గొప్ప వేదికలని అన్నారు. దుర్గామాత కరుణాకటాక్షాలతో రాష్ట్ర ప్రజలందరికీ మేలు జరగాలని, గ్రామాల్లో సిరిసంపదలు వెల్లివిరియాలని, రైతులకు పాడిపంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించారు.
నవరాత్రోత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న ఉత్సవ కమిటీ సభ్యులను అభినందించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖశాంతులు, సౌభాగ్యాలు నిండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కాంతా ల కేశవ రెడ్డి, జిల్లా టి ఆర్ ఎస్ జిల్లా కార్యదర్శి బొల్లబోయిన రవి యాదవ్, మాజీ సర్పంచ్ సాహురే రాజేశ్వర రావు, గ్రామ అధ్యక్షుడు నాగబాబోయిన సాంబయ్య, మండల నాయకులు హాజరయ్యారు.
ఈ కార్యక్రమ దుర్గామాత దీక్షాపరులు, భక్తులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
