Preloader
Reporter:K.Ashok

(జై భారత్ వాయిస్, న్యూస్ ఆత్మకూరు) : ఆత్మకూరు మండలంలోని పెద్దాపూర్ గ్రామంలో గత ఐదు సంవత్సరాల గ్రామపంచాయతీ నిధుల దుర్వినియోగంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామ ప్రజాప్రతినిధులు జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) కి వినతిపత్రం అందజేశారు.
పెద్దాపూర్ గ్రామ సర్పంచ్ ఎలుకటి రవి, ఉప సర్పంచ్ జిల్లపెల్లి కుమారస్వామి వార్డు సభ్యులు కలిసి ఈ ఫిర్యాదు చేశారు. మాజీ సర్పంచ్ సావూరే కమల గత ఐదు సంవత్సరాల గ్రామపంచాయతీ రికార్డులను, ఆదాయ వ్యయాల వివరాలను ఇవ్వకుండా దాచిపెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
అంతేకాకుండా గ్రామపంచాయతీ నూతన భవన నిర్మాణంలో నాణ్యత లోపం ఉందని, భవనం పెచ్చులు ఊడిపోతుందని, దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో కోరారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు కమలాపురం రమేష్, వార్డు సభ్యులు ఎలుకటి రవి, కొమ్ముల రాణి, బోనాల రాంబాబు, ఎలుకటి ప్రియాంక, లాసాన్ని విలన్, కొమ్ముల సురేష్ తదితరులు పాల్గొన్నారు

Share this news as a Photo Card

28 October 2026

పెద్దాపూర్ మాజీ సర్పంచ్ పై డీపీఓకు ఫిర్యాదు

www.jaibharatvoice.com