(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు)
హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం నీరుకుళ్ళ గ్రామంలో గురువారం ఎమ్మార్ పి ఎస్ నీరుకుళ్ళ గ్రామ కమిటీ అధ్యక్షులు ఆర్షం అనిల్ ఆధ్వర్యంలో విద్యార్థులతో సమావేశం ఎం ఎస్ ఎఫ్ నూతన గ్రామ కమిటీ ఎన్నిక కార్యక్రమం నిర్వహించారు.
మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఏం ఎస్ ఎఫ్ నూతన గ్రామ కమిటీల ఎన్నికలో భాగంగా నిర్వహించిన ఈ సమావేశంలో నాయకులు ఏం ఆర్ పి ఎస్ ఆత్మకూరు మండల ఇంచార్జీ నద్దునూరి రఘు మాట్లాడుతూ ఎలాంటి పరిస్థితుల్లోనైనా విద్యకు దూరం కావద్దని సూచించారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం, మాదిగ అమరవీరుల ప్రాణత్యాగం వలన సాధించుకున్న ఎస్సీ రిజర్వేషన్లను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నతమైన జీవితాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.
నూతనంగా ఎన్నికైన ఏం ఎస్ ఎఫ్ నీరుకుళ్ళ గ్రామ కమిటీ
అధ్యక్షులు ఆర్షం పవన్
అధికార ప్రతినిధి గా రేణిగుంట్ల శివరాజ్
ప్రధాన కార్యదర్శి గా హర్షం రంజిత్ ,
ఉపాధ్యక్షులు గా హర్షం రేవంత్ , హర్షం శ్రావణ్ ,
కార్యదర్శి గా నగరపు అభినయ్, సహాయ కార్యదర్శి గా ఆర్షం రాజు ,
కోశాధికారి గా హర్షం జయంత్ ,
కార్యవర్గ సభ్యులు గా ఆర్షం లోకేష్ , వడ్డేపల్లి ప్రేమ్ చరణ్ , వడ్డేపల్లి ప్రభు తేజ , హర్షం నాగరాజు
ఈ కార్యక్రమంలో ఎమ్మార్ పి ఎస్ మండల అధ్యక్షులు కోడెపాక రాజు, మండల ఉపాధ్యక్షులు ఆర్షం సునీల్ మండల నాయకులు ఆర్షం సాగర్ , ఆర్షం ప్రవీణ్ , గుడుకుంట్ల రమేష్ , కొంగరి నరేష్ , ఎం ఎస్ పీ అధికార ప్రతినిధి ఆర్షం సుధాకర్ , మండల నాయకులు నాగారపు మొగిలీ తదితరులు పాల్గొన్నారు.
