(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు )
ఆత్మకూరు మండలం కామారం గ్రామ కౌండిన్య గౌడ సంఘం నూతన కమిటీని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘ అభివృద్ధి, సభ్యుల సంక్షేమం, సామాజిక ఐక్యతను ప్రధాన లక్ష్యంగా నూతన కమిటీని ఏర్పాటు చేసినట్లు సంఘ పెద్దలు తెలిపారు.
ఈ ఎన్నికల్లో గౌరవ అధ్యక్షులుగా మూల కృష్ణమూర్తి గౌడ్, గౌరవ సలహాదారుగా మూల రాంబాబు గౌడ్ ఎన్నికయ్యారు. అధ్యక్షులుగా మూల మధుకర్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా బూర వరుణ్ గౌడ్, ఉపాధ్యక్షులుగా నర్మేటి రాజేష్ గౌడ్, కోశాధికారిగా నర్మేటి రవితేజ గౌడ్, ప్రచార కార్యదర్శిగా బూర మల్లికార్జున్ గౌడ్, సంయుక్త కార్యదర్శిగా పూజరి రాజేష్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
కమిటీ సభ్యులుగా నర్మేటి రాంబాబు గౌడ్, మూల సతీష్ గౌడ్, మూల వేణుగోపాల్ గౌడ్, మూల నవీన్ గౌడ్, మూల రామకృష్ణ గౌడ్, బూర సుమన్ గౌడ్, నర్మేటి కృష్ణమూర్తి గౌడ్, పర్యవేక్షణ సభ్యులుగా మూల ప్రవీణ్ గౌడ్, బూర రాజశేఖర్ గౌడ్, మూల రంజిత్ గౌడ్, పూజరి రాజశేఖర్ గౌడ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. అనంతరం నూతన అధ్యక్షులు మూల మధుకర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి బూర వరుణ్ గౌడ్ మాట్లాడుతూ తమపై నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్రతి సభ్యుడికి కృతజ్ఞతలు తెలిపారు. సంఘ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తామని, ప్రతి సభ్యుడికి అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి, ఐక్యతకు, సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు.
