– ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి
Reporter:K.Ashok
(జై భారత్ వాయిస్, న్యూస్ ఆత్మకూరు )
దశాబ్దాలుగా పేద ప్రజలు ఎదురుచూస్తున్న సొంతింటి కలను కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం సాకారం చేస్తోందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు.
ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్ గ్రామంలో ఆదివారం”మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి” కార్యక్రమంలో వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కుటుంబాలతో కలిసి దీపాలు వెలిగించి, మిఠాయిలు పంచుకుంటూ దీపావళి సంబరాలు జరుపుకున్నారు. అంతకుముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదలకు సొంతింటి కల నెరవేరుతోందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో పేద కుటుంబాల జీవితాల్లో కొత్త వెలుగులు నిండాయన్నారు. ప్రతి పేద కుటుంబానికి ఆత్మగౌరవంతో కూడిన జీవనం అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు.
ఇందిరమ్మ ఇళ్లు లేని గ్రామం ఉండదని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రాధాన్యత క్రమంలో దశలవారీగా ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. లబ్ధిదారులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తహసిల్దార్ జగన్మోహన్ రెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బోరిగం స్వామి, అగ్రంపహాడ్ సర్పంచ్ గంగుల మహేందర్, అక్కంపేట సర్పంచ్ ముద్దం సాంబయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రేవూరి జలంధర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి కమలాపురం రమేష్, నాయకులు కంచ రవికుమార్, చిదిరాల శ్రీనివాస్ రెడ్డి, కార్యకర్తలు, గ్రామస్తులు, అధికారులు పాల్గొన్నారు.
