(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు)
తెలంగాణ ఉద్యమ నేత, స్వాతంత్ర్య సమరయోధుడు, పద్మశాలి సంఘం అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఆత్మకూరు మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు వెల్దె వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. సంఘ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ప్రజల హక్కుల కోసం, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడని అన్నారు. ఆయన ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.ఈకార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు సంఘ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.
