జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ
కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, వరంగల్ (కిట్స్‌డబ్ల్యు) కళాశాలకు చెందిన బీ.టెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విద్యార్థిని, స్వామి వివేకానంద బర్త్‌డే సెలబ్రేషన్స్ (svbc) క్లబ్ అధ్యక్షురాలు ఆర్. సాయి సంజన రెడ్డి ప్రతిష్ఠాత్మక **నట్వర్ గోపీకృష్ణ అవార్డును గెలుచుకుని సంస్థకు కీర్తి ప్రతిష్ఠలను తీసుకువచ్చారని మాజీ రాజ్యసభ ఎంపీ,కిట్స్ వరంగల్ ఛైర్మన్ కెప్టెన్ వి. లక్ష్మీకాంత రావు తెలిపారు. ఈ కార్యక్రమం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రాయ్‌పూర్‌లో నిర్వహించిన AIDA నట్వర్ గోపీకృష్ణ జాతీయ అవార్డులు, అంతర్జాతీయ సంగీత, నృత్య పోటీలు,నృత్యానందలహరి డ్యాన్స్ ఫెస్ట్–2026లో ఆమె ఈ అవార్డును సాధించారని హైలైట్ చేశారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోక్ రెడ్డి మాట్లాడుతూ, కూచిపూడి నృత్యంపై ఆమెకు ఉన్న అంకితభావం, సాంకేతిక విద్యాభ్యాసంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను సమర్థవంతంగా సమన్వయం చేసుకునే నైపుణ్యం ఈ విజయానికి నిదర్శనమని పేర్కొన్నారు. *ది టెంపుల్ డ్యాన్స్ స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ కు చెందిన గురువు హిమాంశి కత్రగడ్డ మార్గదర్శకత్వంలో ఆమె నృత్య శిక్షణ పొందారు.ఈ సందర్భంగా మాజీ రాజ్యసభ సభ్యులు, కిట్స్ వరంగల్ చైర్మన్ కెప్టెన్ వి. లక్ష్మీకాంత రావు, కోశాధికారి పి. నారాయణ , హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే, కిట్స్ అదనపు కార్యదర్శి . ఓడితెల సతీష్ కుమార్ , ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోక్ రెడ్డి, ఆర్. సాయి సంజన రెడ్డిని అభినందించి, ఆమె ప్రతిభను ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో సి.ఎస్.ఈ విభాగాధిపతి ప్రొఫెసర్ పి. నిరంజన్, అన్ని విభాగాల డీన్లు, విభాగాధిపతులు, విద్యార్థి వ్యవహారాల డీన్ ప్రొఫెసర్ కె. శ్రీధర్, ఎం డియఫ్ ఫ్యాకల్టీ ఇన్‌చార్జీలు డా. పి. ఎస్. ఎస్. మూర్తి , కె. శైలజ,ఎస్‌వీబీసీ క్లబ్ ఫ్యాకల్టీ ఇన్‌చార్జి డా. కె. రాజేంద్ర ప్రసాద్, ఎం డియఫ్ జాయింట్ సెక్రటరీ టి.వి.ఎన్. దివ్యాంశ్, పీఆర్వో డి. ప్రభాకరాచారి, ఇతర అధ్యాపకులు, విద్యార్థి బృందం పాల్గొని విజేత సాయిసంజనరెడ్డిని అభినందించారు. ఆమె విద్యా రంగంలోనూ, కళా రంగంలోనూ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

