Preloader
Reporter: Abhinava Nethaji

(జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ)
 కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ వరంగల్‌  (కిట్స్‌డబ్ల్యు) కు చెందిన స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ ( సాక్ ) ఆధ్వర్యంలోని స్వామి వివేకానంద జన్మదిన వేడుకల (ఎస్‌వీబీసీ) క్లబ్, విద్యార్థులు పదిహేను వేల నగదు బహుమతితో పాటు రెండవ స్థానాన్ని సాధించారని మాజీ రాజ్యసభ ఎంపీ  కిట్స్‌ వరంగల్ ఛైర్మన్ కెప్టెన్ వి. లక్ష్మీకాంత రావు  తెలిపారు.ఈ సందర్భంగా కెప్టెన్ వి. లక్ష్మీకాంత రావు మాట్లాడుతూ, దక్షిణ రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని యువత కోసం “ప్రాంత్ లెవెల్ రీల్ మేకింగ్ కాంపిటీషన్స్-2026″ అనే జాతీయ స్థాయి ఈవెంట్‌లో భాగంగా, వివేకానంద కేంద్ర కన్యాకుమారి (వి కె కె), తెలుగు ప్రాంత్, హైదరాబాద్ వారు అక్టోబర్ 22-25 తేదీలలో 3 రోజుల ఇంటెన్సివ్ లీడర్‌షిప్ డెవలప్‌మెంట్ క్యాంప్‌ను నిర్వహించారని హైలైట్ చేశారు. ఈ ఈవెంట్ యొక్క థీమ్ ‘డిజిటల్ మీడియా మరియు యువత’ అని  కెప్టెన్ తెలిపారు. విద్యార్థి సమాజ ప్రయోజనం కోసం సరైన సవాళ్లను ఎదుర్కోవడానికి ఏకాగ్రత, నైపుణ్యం, సృజనాత్మకత, ఆచరణాత్మక జ్ఞానం అవసరమని చెప్పారు.ఈ సందర్భంగా ప్రొఫెసర్ కె. అశోక రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, డిజిటల్ మీడియా ప్రభావం మరియు దేశ నిర్మాణంలో దాని పాత్ర గురించి యువతలో అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. డిజిటల్ మీడియాను బాధ్యతాయుతంగా, నిర్మాణాత్మకంగా ఉపయోగించడం ద్వారా యువతకు జ్ఞానాన్ని అందించి, వారి సామాజిక బాధ్యతను బలోపేతం చేసి, ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవడంలో సహాయపడగలదని ఆయన నొక్కి చెప్పారు. బి.టెక్ మొదటి సంవత్సరం సీఎస్ఈ విభాగానికి చెందిన సాయి తేజ రెడ్డి, అక్షయ, సౌమ్య, నంద కిషోర్ మరియు శివ రంజన్‌లతో కూడిన విజేత  ఫ్యూచర్ మేకర్స్ – విద్యార్థి బృందం ” అని ప్రిన్సిపాల్ తెలిపారు.ఈ సందర్భంగా మాజీ రాజ్యసభ ఎంపీ, కిట్స్ వరంగల్  ఛైర్మన్, కెప్టెన్ వి. లక్ష్మీకాంత రావు,  కోశాధికారి పి.నారాయణరెడ్డి,  హుస్నాబాద్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే  కిట్స్ వరంగల్ అడిషనల్ సెక్రటరీ, వి. సతీష్ కుమార్  ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె అశోక రెడ్డి  ఎస్‌వీబీసీ ఫ్యాకల్టీ  డాక్టర్ కె. రాజేంద్ర ప్రసాద్, కె. గౌతమ్ రాజు  అధ్యాపక బృందంను, విజేత  ఫ్యూచర్ మేకర్స్ – విద్యార్థి బృందాన్ని శుభాకాక్షలతో అభినందించారు.ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం. కోమల్ రెడ్డి, డీన్ స్టూడెంట్ అఫైర్స్, ప్రొఫెసర్ కె. శ్రీధర్,  ఎస్‌వీబీసీ ఫ్యాకల్టీ ఇన్‌ఛార్జ్ లు;  డాక్టర్ కె. రాజేంద్ర ప్రసాద్ (ఫిజిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్)  మరియు కె. గౌతమ్ రాజు (ఐటి అసిస్టెంట్ ప్రొఫెసర్),  కెమిస్ట్రీ అసోసియేట్ ప్రొఫెసర్ మరియు పి.ఆర్.ఓ. డాక్టర్ డి. ప్రభాకరా చారి, విజేత  ఫ్యూచర్ మేకర్స్ – విద్యార్థి బృందం పాల్గొన్నారు.

Share this news as a Photo Card

27 October 2026

నేషనల్ ఈవెంట్- "ప్రాంత్ లెవెల్ రీల్ మేకింగ్ కాంపిటీషన్స్-2026 లో కిట్స్ విద్యార్థులు

www.jaibharatvoice.com