Preloader
ఘనంగా తెలంగాణ తొలి స్పీకర్ మధుసూదనా చారి జన్మదిన వేడుకలు

-పాల్గొన్న తెలంగాణ ఉద్యమకారులు

(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు)

ఆత్మకూరు మండలంలోని గూడెప్పాడ్ సెంటర్లో తెలంగాణ తొలి స్పీకర్ సిరికొండ మధుసూనా చారి జన్మదిన వేడుకలు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆత్మకూరు మండల కమిటీ అధ్యక్షులు ఎండి బాబుమియా( చిరు ) ఆధ్వర్యంలో కేకు కట్ చేసి స్వీట్లు పండ్లు పంచుతూ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇరుసడ్ల సదానందం పాల్గొని మాట్లాడుతూ శాసనమండలి సభ్యులు సిరికొండ మధుసూధనాచారి నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు ప్రసాదించాలని ఆకాంక్షించారు. తెలంగాణ ఉద్యమకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి ఉద్యమకారుల సమస్యలను పరిష్కరించే విధంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు .ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కార్యదర్శి వంగేటి ప్రభాకర్, మండల అధ్యక్షులు ఎండి బాబుమియా, జిల్లా ఉపాధ్యక్షులు అంకతి రవి , ప్రధాన కార్యదర్శి దుంక దువ్వ రాజన్న, ఆత్మకూరు పట్టణ అధ్యక్షులు భాష బోయిన సాగర్, నీరుకుల్లా గ్రామ అధ్యక్షులు పసుల లక్ష్మీనారాయణ తో పాటు తెలంగాణ ఉద్యమకారులందరూ పాల్గొన్నారు.

Share this news as a Photo Card

13 October 2026

ఘనంగా తెలంగాణ తొలి స్పీకర్ మధుసూదనా చారి జన్మదిన వేడుకలు

www.jaibharatvoice.com