(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు): జిల్లాలో బిజెపి పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తామని జిల్లా బీజేవైఎం ప్రధాన కార్యదర్శి పోరెడ్డి ప్రదీప్ రెడ్డి అన్నారు. భారతీయ జనతా పార్టీ యువ మోర్చా (BJYM) హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ఆత్మకూరు మండలం గూడెప్పాడ్ గ్రామానికి చెందిన పొరెడ్డి ప్రదీప్ రెడ్డి, స్థానిక శ్రీ ఆనంద రామాలయంలో హనుమంతుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు ఆరుట్ల కేశవమూర్తి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో యువకులు, పెద్దలు ప్రదీప్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బీజేపీ మాజీ మండల అధ్యక్షుడు ఇర్సడ్ల సదానందం, ఆర్టీఐ జిల్లా కన్వీనర్ ఎదులాపురం శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రదీప్ రెడ్డి చురుకైన కార్యకర్త అని, ఆయన నాయకత్వంలో యువకులు పెద్ద ఎత్తున బీజేపీలో చేరతారని అన్నారు. జిల్లా నాయకత్వం ఆలోచించి ప్రదీప్ రెడ్డిని జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు పొంది ఆత్మకూరు మండలానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో రాచర్ల నరేష్, సోషల్ మీడియా మండల కన్వీనర్ దినేష్, బీజేపీ దామెర మండల ప్రధాన కార్యదర్శి గండు ముఖేష్, బూత్ అధ్యక్షులు పెండ్యాల సునీల్ రెడ్డి, ఊకంటి శ్రీనివాస్ రెడ్డి, పరికి రాజు, పరశురాం, ప్రశాంత్, బీజేవైఎం నాయకులు బండి రాజశేఖర్, బండి శ్రవణ్ కుమార్, పొరెడ్డి సమ్మిరెడ్డి, పరికి దేవేందర్, శివ, బలభద్ర, సాయిరామ్, గ్రామ పెద్దలు, యువకులు రితిక్, రాజు తదితరులు పాల్గొన్నారు.