(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు): ఆత్మకూరు మండల కేంద్రంలో ని పంచకూట మహాదేవ ఆలయంలో 8 రోజులుగా నిర్వహిస్తున్న బొడ్డెమ్మ ముగింపు సంబరాలు శుక్రవారం అంగరంగ వైభవంగా ముగిశాయి. మహిళా భక్తులు ఏకరూప దుస్తులు ధరించి, కోలాటాలు, చప్పట్లతో, భక్తి పాటలతో గౌరమ్మను కొలిచారు. “బొడ్డెమ్మ బొడ్డెమ్మ కోలు…” అంటూ పాటలు పాడుతూ మహిళలు ఆనందోత్సాహాలతో ఆడిపాడారు. “మళ్లీ వచ్చే ఏడాది మళ్లీ రావమ్మా” అంటూ బొడ్డెమ్మ తల్లికి నైవేద్యాలు సమర్పించారు.”ఇసుకలో పుట్టే గౌరమ్మ.. ఇసుకల పెరిగే గౌరమ్మ.. ఇసుక వసంతం ఆడే గౌరమ్మ..” అంటూ భక్తి గీతాలు ఆలపిస్తూ బొడ్డెమ్మను నిమజ్జనం చేశారు.ఈ కార్యక్రమంలో పూజారి రాణి, తోట అరుణ, సిరిపురం లలిత, సిరిపురం శ్రీలత, పూజారి స్రవంతి, తోట లావణ్య, పాపని రూప, ఊర్మిళ, రేణుక, మంజుల, రాధిక, స్వప్న, పూలమ్మ తదితర మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

