కాకతీయ విశ్వవిద్యాలయంలో సెప్టెంబర్ 30న ఆర్చరీ జట్ల ఎంపికలు నిర్వహించారు. ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాలకు చెందిన పురుష, మహిళా క్రీడాకారులు ఇండియన్ రౌండ్, రికర్వ్, కాంపౌండ్ విభాగాల్లో జరిగిన ఎంపికల్లో పాల్గొన్నారు. సుమారు 25 మంది క్రీడాకారులు ఈ ఎంపికలకు హాజరయ్యారు. ఎంపికైన కేయూ ఆర్చరీ జట్లు ఈ విద్యా సంవత్సరంలో డిసెంబర్లో అస్సాం రాష్ట్రంలోని తేజస్ యూనివర్సిటీలో జరగనున్న ఆల్ ఇండియా ఇంటర్-యూనివర్సిటీ ఆర్చరీ పోటీల్లో పాల్గొంటాయని కేయూ స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి డా. టి. శాస్త్రి తెలిపారు. ఎంపికలను కేయూ వైస్ ఛాన్సలర్ ఆచార్య కె. ప్రతాప్ రెడ్డి ప్రారంభించగా, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి. రామచంద్రం పాల్గొని క్రీడాకారులను అభినందించారు. ఎంపికైన క్రీడాకారులకు కేయూ గ్రౌండ్స్‌లో 15 రోజుల కోచింగ్ క్యాంప్ నిర్వహించి, ఆల్ ఇండియా పోటీలకు సిద్ధం చేస్తామని ఇంటర్-కాలేజియేట్ టోర్నమెంట్ ఇన్చార్జి డా. ఎస్. కుమార్ తెలిపారు. కార్యక్రమంలో డా. ఏటీబీటీ ప్రసాద్, ఆర్ట్స్ అండ్ సైన్స్ పీడీ ఆంజనేయులు, పీడీ సుమన్, న్యూ సైన్స్ college పీడీ, సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ పర్వీన్ తదితరులు పాల్గొన్నారు.