Preloader
  • (జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు)
    తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆవిర్భావ దినోత్సవం వేడుకలు రాష్ట్ర అధ్యక్షులు సీమ శ్రీనివాస్ ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఫంక్షన్ హాల్ లో ఘనంగా జరిగాయి. ఈ సమావేశానికి ఆత్మకూరు, దామెర మండలాల నుంచి ఉద్యమకారులు హాజరు అయ్యారు. ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇర్సడ్ల సదానందం మాట్లాడుతూ 2023 శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు .ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం దామెర ఆత్మకూర్, మండల అధ్యక్షులు ఎండి బాబు మియా, చిరు పోలెపాక ఆరోగ్యం జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి గోవిండు అశోక్, సర్పంచులు పెరుక సత్యం, అంకతి రవి, రాయరాకుల రవీందర్, మండల ప్రధాన కార్యదర్శి దొంక దువ్వ రాజన్న, దండు రాజు, మోరే మహేందర్, గోవింద ప్రభాకర్ ,దండు రాజు, కుంట మల్ల రాజు, సారారాజు బుస్సా ఐలయ్య ,దండు భాస్కర్, శోభన్ బాబు తదితరులు పాల్గొన్నారు

Share this news as a Photo Card

27 September 2026

తెలంగాణ ఉద్యమ కారులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి

www.jaibharatvoice.com