-నిందితులను అరెస్టు చేసిన పోలీసులు
(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు)
ఆత్మకూరు మండలం గూడేప్పాడు వద్ద అక్రమంగా తరలిస్తున్న గంజాయినీ పట్టుకుని నిందితులను అరెస్టు చేసి నట్లు ఆత్మకూరు సి ఐ బాబు లాల్ తెలిపారు.ఆయన తెలిపిన వివరాల ప్రకారం, ఆదివారం ఆత్మకూర్ ఎస్ఐ పి. తిరుపతి తన సిబ్బందితో కలిసి గూడేపహాడ్ క్రాస్ రోడ్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో, ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని పట్టుకుని తనిఖీ చేయగా వారి వద్ద గంజాయి ఉన్నట్లు గుర్తించారని అన్నారు అల్లూరి సీతారామరాజు జిల్లా కు చెందిన వెలుగూరి తాతారావు, చింతూరు మండలానికి చెందిన కిలో గోపాలరావు,
కిలో సతీబాబు, ల వద్ద నుండి సుమారు 91 కిలోల ఎండు గంజాయి, విలువ సుమారు రూ.45.66 లక్షలు విలువ ఉంటుందని తెలిపారు.అలాగే 2 స్మార్ట్ మొబైల్ ఫోన్లు మరియు 1 కీప్యాడ్ మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు అనంతరం నిందితులను ఆత్మకూర్ పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి, వారిపై NDPS చట్టం కింద కేసు నమోదు చేసి, వారిని అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం పరకాల కోర్టుకు తరలించామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ పి. తిరుపతి, పీసీలు అనిల్ కుమార్, కరణ్, శ్రీనివాస్ ప్రసాద్ మరియు హోంగార్డ్ కరుణాకర్ పాల్గొన్నారు.
