Preloader
కష్టకాలంలో అండగా ఉంటాం – బాధిత కుటుంబాలకు భరోసా
-పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

Reporter:K.Ashok

(జై భారత్ వాయిస్ న్యూస్, ఆత్మకూరు)

  • ఆత్మకూరు మండలంలోని అగ్రంపాడు, గూడప్పాడు గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి సోమవారం పరామర్శించారు.
    ముందుగా అగ్రంపాడు గ్రామానికి చెందిన ఆవుల పవన్ సాయి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చి, వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు.
    అనంతరం గూడప్పాడు గ్రామానికి చెందిన పోరెడ్డి లక్ష్మారెడ్డి మృతి చెందగా, ఆయన పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.
    ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ… బాధిత కుటుంబాలకు కష్టకాలంలో అండగా ఉంటామని భరోసా కల్పించారు. ప్రభుత్వ పరంగా అందాల్సిన సహాయ సహకారాలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.
    ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు బోరిగం స్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి కమలాపురం రమేష్, , జిల్లా కార్యదర్శి చిదిరాల శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ పొనుగోటి సత్యనారాయణ, ఆత్మకూరు మండల పార్టీ అధ్యక్షుడు రేవూరి జలంధర్ రెడ్డి, అగ్రం పహాడ్ సర్పంచు గంగుల మహేందర్, గూడ పాడ్ సర్పంచ్ పరికి రమేష్ బాబు, గ్రామ పార్టీ అధ్యక్షులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్, యూత్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Share this news as a Photo Card

04 November 2026

కష్టకాలంలో అండగా ఉంటాం - బాధిత కుటుంబాలకు భరోసా

www.jaibharatvoice.com