Preloader

Reporter: K.Ashok

(జై భార‌త్ వాయిస్ న్యూస్ ఆత్మకూర్)
భూముల రీసర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు. బుధవారం ఆత్మకూరు మండలం బ్రాహ్మణ పల్లి రెవెన్యూ లోని కామారం గ్రామం లో జరుగుతున్న భూముల రీ సర్వే తీరును హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ పరిశీలించారు ఈ సందర్బంగా ఇంకా ఎన్ని ఎకరాలలో సర్వే పూర్తి చేయాల్సి ఉందనే వివరాలను భూములు, కొలతలు శాఖ ఏడీ నూర్ సింగ్, సర్వేయర్లను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఎన్ని రోవర్లతో సర్వే నిర్వహిస్తున్నారని ఆరా తీశారు. అక్కడ ఉన్న స్థానిక రైతులతో సర్వే తీరు గురించి కలెక్టర్ మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూముల రీ సర్వే ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ భూముల సరిహద్దులు, విస్తీర్ణం, యాజమాన్య వివరాలను కచ్చితంగా నమోదు చేసే దిశగా రీసర్వే ప్రక్రియ కొనసాగుతుందన్నారు.భూముల రీసర్వేను పూర్తి చేయడంలో రైతులు సహకరించాలని సూచించారు.సర్వే సమయం లో రైతులు తమ భూమి హద్దులను సరిగా చూపించాలని అన్నారు. సర్వేయర్లు సర్వే సమయం లో జాగ్రత్తలు వహించాలని సూచించారు.పారదర్శకంగా చేపడుతున్న భూముల రీసర్వేతో రైతుల భూ హక్కులకు భరోసా లభిస్తుందన్నారు.రీసర్వే ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులు, సర్వేయర్లకు సూచించారు. ఈ కార్యక్రమం లో స్థానిక తహసిల్దార్ జగన్మోహన్ రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి,కామారం సర్పంచ్ తోట లక్ష్మీ, ఇతర అధికారులు, సర్వేయర్లు, స్థానిక రైతులు, తదితరులు పాల్గొన్నారు

Share this news as a Photo Card

04 November 2026

ఆత్మకూర్ లో భూ రీసర్వే ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్

www.jaibharatvoice.com