Preloader
Reporter; K.Ashok
(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు )

ఆత్మకూరు మండలంలోని ఆత్మకూరు, గుడెపాడు గ్రామలలో వరంగల్– ఖమ్మం –నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఆత్మకూరు మండల పార్టీ అధ్యక్షులు రేవూరి జలంధర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల గొంతుకను శాసనమండలిలో బలంగా వినిపించేందుకు అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని రేవూరి జలంధర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత శక్తివంతమైన ఆయుధమని, ప్రతి పట్టభద్రుడు తన ఓటు హక్కును నమోదు చేసుకొని ప్రజాస్వామ్య బలోపేతంలో భాగస్వామి కావాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ కక్కెర్ల రాజు, బిఎల్ఎ లు పరికరాల వాసు, చిదిరాల శ్రీనివాస్ రెడ్డి, అల్వాల రవి, పట్టభద్రులు తదితరులు పాల్గొన్నారు.

Share this news as a Photo Card

03 November 2026

అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు కావాలి

www.jaibharatvoice.com