-ప్రజావాణిలో నాయబ్ తహసీల్దార్ కు అఖిల పక్షం ఫిర్యాదు
Reporter: K.Ashok
(జై భారత్ వాయిస్ న్యూస్, ఆత్మకూరు )
ఆత్మకూరు మండలంలోని అతిపెద్ద కటాక్షపూర్ చెరువు శిఖం భూమి యథేచ్ఛగా కబ్జాకు గురవుతోందని, వందల ఎకరాల్లో విస్తరించి ఉన్న చెరువును కాపాడాలని హౌజ్ బుజుర్గు, కటాక్షపూర్ గ్రామాల భూ పరిరక్షణ అఖిల పక్షం కమిటీ నాయకులు డిమాండ్ చేశారు.
సోమవారం ఆత్మకూరు మండల ప్రజావాణి కార్యక్రమంలో నాయబ్ తహసీల్దార్ మమతకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… కటాక్షపూర్ చెరువు పై ఆధారపడి వందలాది మంది రైతులు పంటలు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారని అన్నారు. అలాంటి చెరువు శిఖం భూమిని కొందరు పట్టా భూమిగా మార్చి అక్రమించాలని చూస్తున్నారని ఆరోపించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా హద్దులు చెరిపేసి ఆక్రమణలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రెవెన్యూ యంత్రాంగం తక్షణమే స్పందించి కటాక్షపూర్ చెరువును పూర్తి స్థాయిలో సర్వే చేసి హద్దురాళ్లు వేసి శాశ్వతంగా కాపాడాలని డిమాండ్ చేశారు. కబ్జాదారులపై చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో అఖిల పక్షం నాయకులు సయ్యద్ మౌలా, ఎండి గఫూర్, నీల రవీందర్, మొగిలిచర్ల వీరస్వామి, షేక్ ఇమామ్, మార్క రజినికుమార్, బోడిగె రాంబాబు, మందల కుమారస్వామి, గుండెబోయిన బాలకృష్ణ, షేక్ హుస్సేన్, సయ్యద్ బషీర్, సలీం పాషా, షేక్ కమాల్, ఉప్పరి మొగిలి, సయ్యద్ వలి, బొల్లెపెల్లి సురేష్ తదితరులు పాల్గొన్నారు.
