(జై భారత్ వాయిస్ న్యూస్ భాగ్యనగరం) నవంబర్ 23న భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ నిర్వాహకులు ముఖ్యమంత్రి . రేవంత్ రెడ్డి ని ఆహ్వానించారు. ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్ జె రత్నాకర్ , చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎస్ జి చలం, ఇతర సభ్యులు ముఖ్యమంత్రి ని కలిసి ఆ మేరకు ఆహ్వానాన్ని అందించారు.
